కాసిపేట మండలంలోని దేవాపూర్ అంగడి బజార్ కు చెందిన మన్నే సాంసన్ ప్రశాంత్ కుమార్ (45) శనివారం విద్యుత్ తో మృతి చెందినట్లు దేవపూర్ ఎస్సై ఆంజనేయులు తెలిపారు. నీటి కోసం ఇంట్లోని భావి వద్ద కరెంటు స్విచ్ ఆన్ చేయగా నీళ్లు రాకపోవడంతో మోటారుకు కట్టిన జిఐ వైరును పట్టుకొని కదిలిస్తున్న క్రమంలో విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.