కాసిపేట మండలం దేవాపూర్ కు చెందిన రుతికేష్ (20) రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని శేరిగూడ వద్ద బైక్ అదుపుతప్పి అక్కడికక్కడే మృతి చెందినట్లు సీఐ జగదీష్ సోమవారం తెలిపారు. రుతికేష్ హెల్మెట్ ధరించి ఉంటే బతికేవాడని తండ్రి రమేష్ కన్నీరుమున్నీరయ్యాడు