కాసిపేట: వీధి కుక్కల దాడి.. బాలుడికి గాయాలు

మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని సోమగూడెం (కె) గ్రామంలోని ట్యాంక్ బస్తిలో శనివారం వీధికుక్కల ఉన్మాదం కలకలం రేపింది. వీధిలో విహరిస్తున్న కుక్కలు ట్యాంక్ బస్తికి చెందిన భూక్య లక్ష్మీనరసింహస్వామి అనే బాలుడిపై దాడి చేయడంతో గాయాలయ్యాయి. వెంటనే బాలుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కుక్కల ఉన్మాదాన్ని అరికట్టేందుకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్