బడులు పున ప్రారంభం రోజే ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సిడాం సంతోషి (50) అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం కాసిపేట మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. సంతోషి దేవపూర్ గిరిజన బాలికల సంక్షేమ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా 2022 నుంచి విధులు నిర్వర్తిస్తుంది. సంతోషి మృతి పట్ల ఉపాధ్యాయ, గిరిజన సంఘాలు నివాళులు అర్పించాయి.