వేమనపల్లి నుంచి నాటు పడవల్లో మహారాష్ట్రకు మద్యం అక్రమ రవాణా

వేమనపల్లి మండలంలోని పలు వైన్స్ దుకాణాల నుంచి కొనుగోలు చేసిన మద్యాన్ని కొందరు వ్యక్తులు గోదావరి నదిపై నాటు పడవల ద్వారా మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో తక్కువ ధరకు కొనుగోలు చేసిన మద్యాన్ని అక్కడ అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. రాత్రింబవళ్లు ఈ అక్రమ రవాణా కొనసాగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత ఎక్సైజ్ పోలీసు అధికారులు దృష్టి సారించి గోదావరి నది మార్గంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి అక్రమ రవాణాను అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు

సంబంధిత పోస్ట్