బెల్లంపల్లి: విద్యుత్ షాక్‌తో ఒకరి మృతి

నెన్నెల మండలం మైలారం గ్రామానికి చెందిన ధర్మరాజుల శ్రీనివాస్ (43) ఆదివారం విద్యుత్ షాక్ తో మృతి చెందినట్లు నెన్నెల ఎస్సై ప్రసాద్ తెలిపారు. ఇంట్లో టేపు రికార్డర్ ను సోల్డరింగ్ వైర్ తో మరమ్మత్తులు చేస్తుండగా ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు. భార్య లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.

సంబంధిత పోస్ట్