చికిత్స పొందుతూ సింగరేణి కార్మికుడు మృతి

బెల్లంపల్లి మండలం మాల గురజాల గ్రామానికి చెందిన సింగరేణి కార్మికుడు గొమాస శివప్రసాద్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. తాళ్ల గురజాల ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 3న రాత్రి విధులు నిర్వర్తించడానికి కాసిపేట 2 గనికి ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి బయలుదేరాడు. గ్రామ సమీపంలో అతివేగంగా వాహనం నడపడంతో స్కిడ్ అయి కిందపడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో హైదరాబాద్ ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్