తాండూర్: తృటిలో తప్పిన రోడ్డు ప్రమాదం

తాండూర్ మండలంలోని బోయపల్లి వద్ద జాతీయ రహదారిపై తృటిలో రోడ్డు ప్రమాదం తప్పింది. రోడ్డుపై వెళ్తున్న లారి ఒక్కసారిగా డివైడర్ ను, ఆ పక్కన ఉన్న విద్యుత్ స్తంభాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. లారీ డ్రైవర్ నిద్ర మత్తులో ఉండి డ్రైవింగ్ చేయడం వల్ల లారీ డివైడర్ ఎక్కినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. తృటిలో ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్