పురుగుల మందు సేవించి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన తాండూరు మండలం అచ్చులాపూర్ గ్రామానికి చెందిన కొండుడు సాగర్ (24) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తాండూర్ పోలీసులు సోమవారం తెలిపారు. ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తునొన సాగర్ మద్యానికి బానిసయ్యాడు. ఈనెల 10న తాగిన మైకంలో పురుగుల మందు సేవించాడు. గమనించిన కుటుంబ సభ్యులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.