మంచినీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తాండూరు మండలం మాదారం టౌన్షిప్ ప్రజలు బుధవారం ధర్నా నిర్వహించారు. మంచినీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో నీటి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ఎస్ఈ టౌన్ జిఎం రాయమల్లు, సివిల్ డివిజన్ జిఎం బాషా హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు.