వేమనపల్లి: ప్రాణహిత ఉధృతి.. ఇబ్బందుల్లో ప్రజలు

వేమనపల్లి మండలంలో ప్రాణహిత నది ఉదృతంగా ప్రవహిస్తుండడంతో శుక్రవారం ముల్కలపేట గ్రామంలోని బ్రిడ్జి పూర్తిగా నీట మునిగింది. సుమారు 10 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రాణహిత నది వరదలు ముంచెత్తి బ్రిడ్జి పూర్తిగా మునిగిపోవడంతో రాచర్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహించేందుకు అంతరాయం ఏర్పడిందని మహిళా ఉపాధ్యాయురాలు వాపోయారు.

సంబంధిత పోస్ట్