వేమనపల్లి: కుటుంబ కలహాలతో ఉరివేసుకొని ఆత్మహత్య

వేమనపల్లి మండలం రాజారాం గ్రామంలోని కురుమగూడెంకు చెందిన బీరేష్ (22) కుటుంబ సభ్యుల మధ్య జరిగిన గొడవల్లో మనస్తాపం చెంది ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు నీల్వాయి ఎస్సై కోటేశ్వర్ సోమవారం తెలిపారు. బీరేశ్ తాత మల్లయ్య 9 నెలల మాసికం కార్యక్రమం శనివారం నిర్వహించిన అనంతరం భోజనాల తర్వాత కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన బీరేశ్ ఇంటి నుంచి వెళ్లి ఎల్లమ్మ గుడి గుట్ట అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకుని మృతి చెందినట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్