ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఒక యువకుడికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆదిలాబాద్ నుంచి జైనథ్ మండలం దీపాయి గూడ కూర గ్రామానికి వెళుతున్న ఆర్టీసీ బస్సు, జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై ఓకలే స్కూల్ వద్ద ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. గాయపడిన యువకుడిని స్థానికులు 108 అంబులెన్స్‌లో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.