బోథ్ నియోజకవర్గంలోని కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు పడుతున్న రైతుల పంటలను పూర్తిస్థాయిలో కొనుగోలు చేసి, రెండు రోజుల్లో వారిని ఇంటికి పంపించాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మార్కెటింగ్ అధికారులను ఆదివారం ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా నియోజకవర్గంలో మొదటిసారిగా 16 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏది ఏమైనా, రెండు రోజుల్లో రైతులకు పట్టీలు అందజేసి ఇళ్లకు పంపించాలని ఆయన స్పష్టం చేశారు.