ఆదిలాబాద్ జిల్లాలో భానుడి ప్రతాపం రోజురోజుకి పెరుగుతోంది. గత 24 గంటల్లో జిల్లాలోని పలు ప్రాంతాల్లో 41 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా బోథ్ మండలం పొచ్చరలో 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. బేల, జైనథ్, సాత్నాల, బోరజ్, ఆదిలాబాద్, ఇచ్చోడ, గుడిహత్నూర్, తలమడుగు, తాంసి మండలాల్లో కూడా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెరుగుతున్న ఎండల తీవ్రత ప్రజలను ఇబ్బంది పెడుతోంది.