ఆర్థిక అక్షరాస్యతపై తెలంగాణ గ్రామీణ బ్యాంకు భీంపూర్ మండలం ఆర్లి (టి) శాఖ వారు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. శనివారం ఆర్లి (టి) తదితర గ్రామాలలో బ్యాంకు లావాదేవీలు, ఏటీఎంల వినియోగం జాగ్రత్తలు గురించి కళాకారులు పాటల ద్వారా వివరించారు. సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ కిరణ్ కుమార్ రెడ్డి, ఫీల్డ్ ఆఫీసర్ కుమార్, సీఎస్పీ రెడ్డి, అనిల్ యాదవ్, రైతులు తదితరులు ఉన్నారు.