పూజలతో ప్రార్థనలు చేసిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్

రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యే ముందు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ గుడిహత్నూర్ మండల కేంద్రంలోని శివాలయం, సాయిబాబా ఆలయాల్లో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా "పేదలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేయకుండా కాపాడండి స్వామి" అని ప్రార్థించారు. ముఖ్యమంత్రి ప్రజల అభీష్టాన్ని నిలబెట్టుకుని 6 గ్యారెంటీలు అమలు చేయాలని దేవుడిని మొక్కారు. ఆయనతోపాటు పలువురు నేతలు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్