విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న ఉపాధ్యాయుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. సంపత్ నాయక్ తండాకు చెందిన రాఠోడ్ మోతిసింగ్ (42) బజారాడిగాలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం ఇంటికి వెళ్తుండగా సొనాల దాటి ఖబరస్తాన్ సమీపంలో ఎడ్లబండిని ఢీకొట్టి తీవ్రంగా గాయపడ్డాడు. బోధ్ సీహెచ్‌సీకి తరలించగా చికిత్సలో మృతి చెందాడు.