8 ఏళ్ల తర్వాత తలమడుగులో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. రోడ్డు నిర్మాణం లేక గ్రామస్థులు పడుతున్న ఇబ్బందులకు సుదీర్ఘ విరామం తర్వాత తెరపడనుంది. 800 మీటర్ల బీటీ రోడ్డు మండల కేంద్రంలో నిర్మాణం లేక గ్రామస్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసేవారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లడంతో ఆయన చొరవతో పనులను ప్రారంభమైనట్లు మండల నాయకులు తెలిపారు.