గుడిహత్నూర్ లో చలి తీవ్రత పెరిగింది, ప్రజలు అప్రమత్తం

ఆదిలాబాద్ జిల్లా, బోథ్ మండల కేంద్రంలో చలి తీవ్రత మరింత పెరిగింది. శుక్రవారం ఉదయం ఆకాశం మబ్బులతో కమ్ముకొని, దట్టమైన పొగమంచు కురిసినట్లుగా కనిపించింది. చలి గాలులతో ప్రజలు వణికిపోయారు. రహదారులపై పొగమంచుతో వాహనదారులు నెమ్మదిగా ప్రయాణించాల్సి వచ్చింది. చిన్నపిల్లలు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరిన్ని రోజులు చలి తీవ్రత కొనసాగవచ్చని వాతావరణ శాఖ సూచించడంతో, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్