గుస్సాడీ నృత్య బృందంతో కలిసి నృత్యం చేసిన కలెక్టర్

బోథ్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల క్రీడా ప్రాంగణంలో బుధవారం జిల్లా స్థాయి బాలికల క్రీడా, సాంస్కృతిక పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. గిరిజన సంస్కృతికి ప్రతీక అయిన గుస్సాడీ నృత్య బృందంతో కలిసి కలెక్టర్ కొద్దిసేపు నృత్యం చేయడం అందరినీ ఆకట్టుకుంది. నెమలి పింఛాలతో అలంకరించిన లయబద్ధమైన నృత్యానికి కలెక్టర్ అడుగులు కలపడంతో ప్రాంగణమంతా కరతాళ ధ్వనులతో మారుమోగింది.

సంబంధిత పోస్ట్