108 అంబులెన్స్‌లో ప్రసవం.. తల్లి బిడ్డ క్షేమం

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం నారాయణపూర్ కు చెందిన సుజాతకు పురిటి నొప్పులు రావడంతో, భర్త లక్ష్మణ్ 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రసవ నొప్పులు ఎక్కువయ్యాయి. ఈ సమయంలో 108 సిబ్బంది గోపి చాకచక్యంగా వ్యవహరించి, అంబులెన్స్‌లోనే ప్రసవం చేయించారు. పండంటి ఆడ శిశువు జన్మించింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని, వారిని ఇచ్చోడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించామని పైలెట్ పవర్ బాబు తెలిపారు.

సంబంధిత పోస్ట్