వడదెబ్బతో రైతు మృతి

బోథ్ మండలంలోని మర్లపెల్లి గ్రామానికి చెందిన ఇర్ల సుధాం (59) అనే రైతు శనివారం వడదెబ్బతో మృతి చెందారు. పొలానికి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన ఆయన, మరుసటి రోజు ఉదయం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 108కు సమాచారం అందించగా, అప్పటికే ఆయన మరణించినట్లు సిబ్బంది తెలిపారు. ఈ ఘటన మండలంలో విషాదం నింపింది.

సంబంధిత పోస్ట్