కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అసమర్ధ విధానాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీమంత్రి జోగురామన్న మండిపడ్డారు. తలమడుగు మండలం చెర్లపల్లికి చెందిన ఆదివాసి రైతు కనక జాదవరావు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో, బుధవారం ఆయన బాధిత కుటుంబాన్ని పరామర్శించి, వారికి భరోసా కల్పించారు. రైతులు ధైర్యం కోల్పోవద్దని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆత్మస్థైర్యంతో ఉండాలని సూచించారు.