ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి: బోథ్ ఎమ్మెల్యే

గుడిహత్నూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 15 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చాలని తులం బంగారం అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్