గుడిహత్నూర్ మండలంలోని మంక్కాపూర్ గ్రామం వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. నార్నూర్ మండలం భీమాపూర్ గ్రామానికి చెందిన భరత్ అనే వ్యక్తి ఆటోలో ఉల్లిగడ్డ లోడుతో ఉట్నూర్ నుంచి గుడిహత్నూర్ అంగడికి వస్తున్న క్రమంలో మంక్కాపూర్ వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టుకు ఢీకొంది. ఈ ప్రమాదంలో భరత్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఖానాపూర్ వైపు వెళ్తున్న ఎమ్మెల్యే గమనించి గాయపడిన వ్యక్తిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.