గుడిహత్నూర్ మండలంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం. బుతాయి నుంచి ఆదిలాబాద్ వెళుతున్న బైక్, ఆదిలాబాద్ నుంచి ఇంద్రవెళ్లి వెళుతున్న ద్విచక్ర వాహనం రెండు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలు కాగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. వెంటనే స్థానికులు క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.