ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం గుండాల గ్రామ శివారులో అక్రమంగా నిల్వ చేసిన టేకు దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం ఆధారంగా అధికారులు తనిఖీలు నిర్వహించగా ఈ అక్రమ నిల్వలు బయటపడ్డాయి. ఇచ్చోడ ఎఫ్ఆర్ఓ నాగవత్ స్వామి, సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్ ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. స్వాధీనం చేసుకున్న టేకు దుంగలను అటవీశాఖ కార్యాలయానికి తరలించారు.