బోథ్ మండలం పొచ్చర గ్రామంలో బుధవారం, రూ. 35 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భూమిపూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వర్షాకాలం లోపే రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో మట్టి రోడ్లు లేకుండా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు స్వామి, స్థానిక సర్పంచ్ రాజు రెడ్డి, మాజీ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, రమణ రెడ్డి, రాజారెడ్డి, మధుమేహన్ రెడ్డి, దివాకర్ రెడ్డి, విష్ణు, రవీందర్ జాదవ్ తో పాటు పలువురు పాల్గొన్నారు.