గుడిహత్నూర్ గ్రామస్థుడు అశోక్ టాకరే (బింగ్రీ) మృతి చెందడంతో ఆయన కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఈ నేపథ్యంలో, మాజీ సర్పంచ్ పవార్ రవి నాయక్ ఆ కుటుంబానికి అండగా నిలిచారు. ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించి, అంత్యక్రియల కోసం ఆర్థిక సహాయంతో పాటు, నిత్యావసర వస్తువులను అందించారు. ప్రమాదంలో ఉన్న కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, యువకులు పాల్గొన్నారు.