తాంసి: సావిత్రిబాయి ఫూలే జయంతి కార్యక్రమం

అణగారిన వర్గాల విద్యాభివృద్ధికి కృషి చేసిన మహనీయురాలు సావిత్రిబాయి ఫూలే అని తాంసి నాయబ్ తహశీల్దార్ గణేశ్ జాదవ్ కొనియాడారు. శుక్రవారం తహశీల్దార్ కార్యాలయంలో ఆమె జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ నరేశ్, జూనియర్ అసిస్టెంట్ దారవేణి రాఘవేంద్ర, సిబ్బంది అశోక్, రాహుల్, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్