ఇచ్చోడ: కండక్టర్ కాలిపై నుంచి వెళ్లిన బస్సు

ఇచ్చోడలో ప్రమాదవశాత్తు శనివారం బస్సు కండక్టర్ కాలిపై నుంచి బస్సు వెళ్ళింది. దీంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. బైంసా నుంచి ఆదిలాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఇచ్చోడ సమీపంలో డ్రైవర్ వెనక్కి తీస్తుండగా.. బస్సు వెనుక ఉన్న కండక్టర్  కాలు జారి కింద పడ్డాడు. అదే సమయంలో బస్సు అతని కాళ్లపై నుంచి వెళ్లగా గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108లో రిమ్స్ కు తరలించారు.

సంబంధిత పోస్ట్