బీఆర్ఎస్ మద్దతు ఉన్న అభ్యర్థి గెలుపే లక్ష్యంగా కష్టపడాలి

సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో బోథ్, సోనాల, నెరడిగొండ, బజార్ హత్నూర్ మండలాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కష్టపడాలని, పార్టీలో విభేదాలు పక్కనపెట్టి గ్రామ అభివృద్ధి, పార్టీ బలోపేతమే ప్రధాన ఎజెండాగా పని చేయాలని ఆయన సూచించారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్