హనుమాన్ ఆలయంలో చోరీ

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కొత్తూరులోని హనుమాన్ ఆలయంలో చోరీ జరిగింది. దొంగలు హనుమాన్ విగ్రహల 2 వెండి కిరీటాలు, వినాయకుని వెండి కళ్లను దొంగిలించారు. వీటి విలువ దాదాపు రూ. 60 వేల వరకు ఉంటుందని స్థానికులు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు జాగిలాలతో పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నామని ఎస్సై రాధిక మంగళవారం పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్