తలమడుగు మండలం ఖోదాడ్ గ్రామంలో తెల్లకల్లు విక్రయ కేంద్రాలపై ఎక్సైజ్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లకల్లు విక్రయిస్తున్న పరమేశ్వర్ వద్దనుండి 80 లీటర్ల తెల్లకల్లు పట్టుబడడం జరిగిందని ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ విజేందర్ తెలిపారు. అనంతరం పరీక్షల నిమిత్తం శాంపిల్స్ సేకరించి తెల్ల కల్లుని ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి దుకాణంలో సీజ్ చేయడం జరిగిందన్నారు.