నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. గుడిహత్నూర్ మండలంలోని మాన్కపూర్ గ్రామంలో పొచ్చమ్మ ఆలయ నిర్మాణానికి రూ. 12 లక్షలు మంజూరైనట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ మేరకు సోమవారం గ్రామస్తులకు ప్రొసీడింగ్ కాపీని అందజేశారు. ప్రొసీడింగ్ కాపీ అందజేసిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు సైతం పరిష్కరిస్తానన్నారు.