షీటీం బృందాలు మహిళలకు, యువతులకు రక్షణగా ఉంటూ వేధింపులకు గురి చేసిన వారిని పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు. బోథ్ కు సంబంధించిన యువతిని నిర్మల్ కి చెందిన సాయి అనే యువకుడు స్నాప్ చాట్ లో వేధింపులకు గురి చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఆదిలాబాద్ షీటీం బృందం నిందితున్ని బోథ్ కు రప్పించి కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. వేధింపులకు గురైయితే 8712659953 నంబర్ను సంప్రదించాలన్నారు