పది రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన చెన్నూరు మండలంలోని కృష్ణంపేట గ్రామానికి చెందిన భీమిని లక్ష్మణ్ (51) మృతదేహం భీమారం శివారు ప్రాంతంలోని గొల్ల ప్రాజెక్టు కట్ట వద్ద కనిపించిందని ఎస్ఐ శ్వేత గురువారం తెలిపారు. లక్ష్మణ్ ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో చెన్నూర్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు అయింది. గొల్లవాగు ప్రాజెక్టు కట్టవద్ద మృతదేహం ఉందని పోలీసులకు పశువుల కాపర్లు తెలిపారు.