భీమారం: ఆర్దిక ఇబ్బందులతో ఒకరి ఆత్మహత్య

భీమారం మండలంలోని కాజిపల్లికి చెందిన జాగేటి రామచందర్ (51) ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై శ్వేత బుధవారం తెలిపారు. కూలీ పనులు చేసుకుంటూనే గత ఏడాది భూమి కౌలుకు తీసుకొని అప్పుచేసి పత్తి సాగు చేశాడు. దిగుబడి రాక అప్పులు పెరగడంతో మనస్థాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో గడ్డి మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై వెల్లడించారు.

సంబంధిత పోస్ట్