కొంతమంది వందేళ్లకు పైబడి జీవించడం ప్రస్తుతం అదే పరంపర కొనసాగుతోంది. మంచి ఆరోగ్య అలవాట్లు, జీవనశైలి, యోగా, శారీరక వ్యాయామంతో వారు వందేళ్ళకు పైగా ఆరోగ్యంగా జీవిస్తున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలో శతాధిక వృద్ధురాలు బుధవారం రాత్రి మృతి చెందింది. పట్టణంలోని కాగజ్ పురాలో నివాసముండే షేక్ వహిదాభి (115) అనారోగ్యంతో మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.