చెన్నూర్: చెట్లు కోయడానికి వచ్చి వ్యక్తి మృతి

చెన్నూర్ మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ధరకొండ (59) అనే వ్యక్తి గంగారం ఎక్స్ రోడ్డు సమీపంలోని మామిడి తోటలో చెట్లు కోస్తున్నాడు. చెట్లు కోసిన తర్వాత ట్రాక్టర్లలో లోడింగ్ చేయడానికి హైడ్రాలిక్ సాయంతో ట్రాలీని పైకి లేపగా, అది ఫెయిల్ అయి ధరకొండ మీద పడింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్