వ్యభిచార గృహం నిర్వహిస్తున్న దంపతులను అరెస్టు చేసినట్లు మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి శనివారం తెలిపారు. రామకృష్ణాపూర్ పద్మావతి కాలనీ గద్దె రాగడిలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లు నమ్మదగిన సమాచారం మేరకు ఓ ఇంటిలో తనిఖీ చేయగా, మహమ్మద్ మోహిన్, అవంతి అనే దంపతులు మధ్యవర్తి ద్వారా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి మహిళలను పిలిపించి వ్యభిచారం నడిపిస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు.