హోంగార్డ్ అకాల మరణం.. ఘన నివాళులర్పించిన పోలీస్ సిబ్బంది

మంచిర్యాల జిల్లా, చెన్నూర్ లోని మందమర్రి పోలీస్ స్టేషన్‌లో హోంగార్డ్‌గా పనిచేస్తున్న గట్టక్క అనారోగ్యంతో అకాల మరణం చెందారు. ఆమె మరణం పోలీస్ శాఖకు తీరని లోటు అని సహచర సిబ్బంది తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ వార్త తెలుసుకున్న మందమర్రి సిఐ పర్స రమేష్, స్థానిక ఏఎస్సైలు మాజీద్ ఖాన్, మిలన్ లు గట్టక్క నివాసానికి చేరుకుని, ఆమె పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, పోలీస్ శాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్