జైపూర్: ప్రమాదవశాత్తు కారు దగ్ధం

జైపూర్ మండలం రసూల్ పల్లి వద్ద శనివారం రాత్రి ప్రమాదవశాత్తు కారు దగ్ధమైంది. వేమనపల్లికి చెందిన డ్రైవర్ కవిరాజు కుటుంబ సభ్యులతో కొండగట్టు వెళ్లి వస్తుండగా రసూల్ పల్లి సమీపంలో జాతీయ రహదారిపై స్పార్క్ వచ్చి కారులో మంటలు వచ్చాయి. కారు పక్కనే నిలిపి దిగిపోయారు. మంటలు వ్యాప్తి చెంది కారు దగ్ధమైంది. సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పి వేశారు. ఎవరికీ ప్రమాదం జరగలేదు.

సంబంధిత పోస్ట్