కోటపల్లి: కారు అదుపుతప్పి ఎఫ్ ఆర్ ఓ కు గాయాలు

చెన్నూర్ మండలంలోని చెన్నూర్, కోటపల్లి ప్రధాన రహదారిపై కారు అదుపుతప్పి ఫారెస్ట్ రేంజ్ అధికారి అప్పలకొండకు తల, నుదిటిపై గాయాలయ్యాయి. చెన్నూరు నుంచి నీల్వాయికి కారులో వెళుతుండగా పాలవాగు సమీపంలో ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో కారు నుజ్జయింది. వెంటనే అటవీశాఖ అధికారులు చెన్నూరు ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్