కోటపల్లి: వడదెబ్బతో మహిళ మృతి

కోటపల్లి మండల కేంద్రానికి చెందిన కర్ణాటకం లక్ష్మమ్మ (55) ఐదు రోజుల క్రితం బంధువు చనిపోగా అదే రోజు ఎండలో అంత్యక్రియలకు వెళ్లి వచ్చింది. మరుసటి రోజు తీవ్ర అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు చెన్నూరుకు తరలించి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. వడదెబ్బతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్