రైలు ప్రమాదంలో గుర్తుతెలియని యువకుడు శనివారం మృతి చెందినట్లు జిఆర్పి ఎస్ఐ మహేందర్ తెలిపారు. మంచిర్యాల- రవీంద్రఖని రైల్వే స్టేషన్ల మధ్య ప్రమాదం జరిగిందని.. మృతి చెందిన యువకుడి వయస్సు 30 నుంచి 35 ఏళ్లు ఉంటాయని, అతని వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని, కుడి చేతి పై ఇండియా అని ఇంగ్లీషులో రాసి ఉందని పేర్కొన్నారు. మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రపరిచినట్లు తెలిపారు.