మందమర్రి: రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి

తాండూర్ మండలానికి చెందిన ఆటో డ్రైవర్ గోమాస తిరుపతి (29) మందమర్రి మండల శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు మందమర్రి ఎస్సై రాజశేఖర్ తెలిపారు. తిరుపతి తన స్నేహితుడు గువ్వల కిషోర్ తో కలిసి కిరాయి నిమిత్తం మంచిర్యాల వెళ్లి మంగళవారం రాత్రి తిరిగి వస్తుండగా వారి ఆటోను వెనక నుంచి లారీ ఢీ కొట్టింది. తిరుపతి, కిషోర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తిరుపతి మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్