మందమర్రి: డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

మందమర్రి మండలంలోని మామిడిగట్టు గ్రామానికి చెందిన దుర్గం సాత్విక (19) ఇంట్లో ఉరి వేసుకుని శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆమె తండ్రి వెంకటేష్ శుక్రవారం విష రసాయనం సేవించగా అపస్మాక స్థితిలోకి వెళ్లడంతో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సాత్విక తన తండ్రిని చూసి వచ్చినట్లు సమాచారం. మృతికి కారణాలు ఇంకా తెలియరాలేదు.

సంబంధిత పోస్ట్