మందమర్రి: కుటుంబ కలహాలతో అన్నను చంపిన తమ్ముడు

కుటుంబ కలహాల నేపథ్యంలో, మందమర్రి మండలం సన్రోల్ పల్లి గ్రామానికి చెందిన మెండ్రప్ గోపాల్ (35)ను అతని సొంత తమ్ముడు మెండ్రపు కుమార్ రోకలిబండతో సోమవారం రాత్రి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. గత కొద్ది రోజులుగా అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయని, ఈ క్రమంలోనే ఈ దారుణం చోటుచేసుకుందని పోలీసులు పేర్కొన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

సంబంధిత పోస్ట్